20 నుంచి వైఎస్ఆర్ నవశకం
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రవేశపెట్టిన పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు వైఎస్ఆర్ నవశకం పేరుతో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి డిసెంబరు 20 వరకు వైఎస్ఆర్ నవశకం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల రోజుల క్యాంపెయిన్‌లో గ్రామ, వార్డు వాలంటీర్లు వారి పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. రోజువారీ సర్వే వివరాలను గ్రామ, వార్డు సచివాలయాకు అందజేయాలని సృష్టం చేశారు. సంక్షేమ పథకాలను సాచ్యురేషన్ విధానంలో అర్హులైన వారిని గుర్తించాలన్నదే ఈ సర్వే లక్ష్యమని సీఎస్ సృస్టం చేశారు. సర్వే ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. కొత్త రేషన్ కార్డు, వైఎస్ఆర్ పెన్షన్, ఆరోగ్య శ్రీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పంపిణీకి లబ్ధిదారుల గుర్తింపనకు ప్రతి ఇంటికీ వెళ్లాల్సిందేనని సృష్టం చేశారు.













