రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు ఆ పార్టీ యత్నం : పార్థసారథి
ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తోన్న పనులను అడ్డుకోవడమే వైసీపీ (YCP) పనిగా పెట్టుకుందని (Parthasarathy) విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రూ.6 కోట్లతో నిర్మించనున్న శ్రీదేవకి యశోద శ్రీకృష్ణ ఆలయానికి మంత్రులు పార్థసారథి, రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అచారకం సృష్టించేదుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీగా పేరు పొందిన వైసీపీ , రాజకీయ లబ్ధి కోసం అరాచకాలు సృష్టించాలని చూస్తోంది. ఆ పార్టీ రాష్ట్రంలో క్రెడిట్ చోరీ అనే కొత్త నినాదాన్ని ఎత్తుకొని ప్రజలను మభ్యపెడుతోంది. వైసీపీ క్రెడిట్ 11 సీట్లు అయితే కూటమి ప్రభుత్వ క్రెడిట్ 164 సీట్లు. కడప స్టీల్ ప్లాంట్ (Kadapa Steel Plant) పనులను గత ప్రభుత్వం గాలికొదిలేస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పనులు చేపట్టి 2028 నాటికి ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తుంటే, వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోనూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని తెలిపారు.
ఇవి కూడా చదవండి








