చీకట్లో చంపేసి.. పొద్దున్నే వెళ్లి పరామర్శ : మంత్రి పార్థసారథి
ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేతలు ఎన్ని నాటకాలైనా ఆడుతున్నారని మంత్రి పార్థసారథి (Parthasarathy) విమర్శించారు. కడప జిల్లాలో స్థిరాస్తి వ్యాపారి పెద్దదస్తగిరి (Pedda Dastagiri) హత్యపై మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. వివేకా (Viveka) హత్య జరిగిన తర్వాత ఎలా నటించారో అందరం చూశామన్నారు. 2019 నుంచి 2024 వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ఎలా తెగబడిందో చూశాం. హత్యలు వీళ్లే చేయిస్తారు. పరామర్శ వీళ్లే చేస్తారు. ప్రజలను పోలీసులను తప్పుదోవ పట్టించేలా కారణాలు వెతుకుతారు. పెద్ద దస్తగిరి ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎంపీ అవినాశ్ రెడ్డి (Avinash Reddy), రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy)కి అత్యంత సన్నిహితుడు అతడు. తాడేపల్లి పెద్దలకు కూడా చాలా సన్నిహితుడు. పులివెందులలో జరిగే రహస్య మంతనాల్లో దస్తగిరి ఉంటాడని కడపలో అందరూ చెబుతారు. చీకట్లో చంపేసి, పొద్దున్నే వెళ్లి పరామర్శ నాటకాలాడుతున్నారు అని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








