ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడికి మద్దతు ప్రకటించిన వైఎస్ జగన్
ఎన్డీఏ తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. తాము ప్రకటించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్ స్పందిస్తూ, ఎన్డీఏ తరపు అభ్యర్థిగానే కాకుండా, తెలుగు వారిగా కూడా వెంకయ్యనాయుడుకి మద్దతు ఇస్తామని అమిత్ షాకు ఆయన చెప్పారు. కాగా, ఏన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన రామ్ నాథ్ కోవింద్ కు కూడా వైసీపీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.













