YS Sharmila: అమెరికా సంస్థలు బయటపెడితే.. మన సంస్థలు మాత్రం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదానీ నుంచి రూ.1750 కోట్లు లంచం తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కోరారు. జగన్ అవినీతిని అమెరికా సంస్థలు బయటపెడితే, మన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అదానీ (Adani) తో జగన్ డీల్‌పై 2021లోనే హైకోర్టులో పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) పిటిషన్ వేశారని గుర్తు చేశారు. యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా కోసం చేసుకున్న ఒప్పందంతో ప్రజలపై రూ.లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.













