వైసీపీలోనే అసలు వైఎస్ఆర్ లేరు : షర్మిల
యుద్ధానికి తాను రెడీ, మీరు రెడీనా? అంటూ వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఒంగోలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు న్యాయం చేయాలనే రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతుంటే, వైసీపీ వారంతా నాపై ముప్పేట దాడి చేస్తున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞం కింద వైఎస్ఆర్ నిర్మిస్తే, జగన్ సర్కారు దానిని నిర్వాహణ కూడా చేయలేకపోతోంది. వైఎస్ వారసులమని చెప్పేవారు. గుండ్లకమ్మను ఎందుకు పట్టించుకోవడం లేదు. గేట్లు ఊడిపోయినా పట్టించుకొని వారా ఆయన ఆశయాలు నిలబెట్టేది? వైఎస్ హయాంలో 70 శాతం పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. జగన్ పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? ప్రశ్నించారు. వైసీపీలో అసలు వైఎస్ఆర్ లేరు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని షర్మిల సెటైర్లు వేశారు.













