దేశంలోనే 3వ బెస్ట్ సిఎంగా జగన్…
దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 3వ స్థానం దక్కించుకున్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియాటుడే నిర్వహించిన పోల్‌లో.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో నిలిచారు. అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంతె.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలిచారు. అనూహ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌లో 24 శాతం ఓట్లు రాగా… కేజ్రీవాల్‌కు 15 శాతం, జగన్‌కు 11 శాతం చొప్పున ఓట్లు పడ్డాయి. కేసీఆర్‌కు 3 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఆ తర్వాతి స్థానాల్లో 2 శాతం ఓట్లతో అశోక్ గెహ్లట్, యడ్యూరప్ప, భూపేష్ బెహగల్, శివరాజ్ సింగ్ చౌహాన్, విజయ్ రూపానీ కేసీఆర్ కంటే వెనుక బడిన వారిలో ఉన్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను ఇండియా టుడే కార్వీ ఇన్సైట్స్ సంయుక్తంగా చేపట్టాయి. గత జులై 15 నుంచి జులై27 తేదీల మధ్య దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న 97 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ సర్వే చేపట్టారు.













