మిమ్మల్ని క్షమించేది లేదు, క్లారిటీ ఇచ్చేసిన జగన్…?
వచ్చే ఎన్నికల్లో అధికారం కాపాడుకోవాలని పట్టుదలగా ఉన్న ఏపీ సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు కాస్త సీరియస్ గానే అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో పార్టీలో ఉంటూ ఇబ్బంది పెట్టె నాయకుల విషయంలో ఆయన కాస్త జాలి దయా లేకుండానే వ్యవహరించే అవకాశం కనపడుతుంది. కొందరు నాయకులు కావాలనే విభేదాలు సృష్టిస్తున్నారు అనే సమాచారం అందుకున్న జగన్ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండానే చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. పదవులు వచ్చినా సరే ఇబ్బంది పెట్టే నాయకులను వదిలే అవకాశం లేదనే సంకేతాలు ఇస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొందరు నాయకుల అవినీతి వ్యవహారాలను చూసి చూడనట్టు వదిలేసిన సిఎం జగన్ ఇప్పుడు వారి మీద కేసులు కూడా పెట్టేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తుంది. పార్టీ కార్యకర్తలను కావాలనే ఇబ్బంది పెట్టే వారి విషయంలో కూడా ఏ మాత్రం చూసి చూడనట్టు పోయే ధోరణి వద్దని జగన్ పట్టుదలగా ఉన్నారట. ఈ మేరకు ఇప్పటికే పార్టీ కీలక నేతలతో కూడా జగన్ మాట్లాడారు. కొందరు యువ నాయకులు పార్టీలోకి రావాలని చూసినా సరే వారిని రానీయని ఒక ఎమ్మెల్యే గారి వ్యవహారం జగన్ వద్దకు చేరింది.
దీనితో ఆ ఎమ్మెల్యే గారి మైనింగ్ వ్యవహారం విషయంలో ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు కేసులు నమోదు చేయించడానికి రెడీ అవుతున్నారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన కొందరు నాయకులు పార్టీ లో విభేదాలు సృష్టిస్తున్నారు అనే సమాచారం అందుకున్న జగన్ వారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా సిద్దమయ్యారు. ఒక రాజ్యసభ ఎంపీ ని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇక మీ సేవలు చాలు అని జగన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. పార్టీ ఇప్పుడు రాజకీయంగా బలంగా ఉంది.
ఇలాంటి తరుణంలో ఈ చర్యలు ఏ మాత్రం సహించేవి కాదని జగన్ సంకేతాలు ఇచ్చేసారు. ఇక మంత్రుల వ్యవహారశైలి మీద కూడా జగన్ సీరియస్ గానే ఉన్నారు. వారి మీద ఎలా అయినా చర్యలు తీసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు లేదని కూడా కొందరు మంత్రులకు స్వయంగా జగన్ చెప్పేశారు అని అంటున్నారు. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది చూడాలి.













