అమరావతిలో జగన్ దీక్ష?
ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై దూకుడు పెంచాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సమయంలో రాజధాని అమరావతిలో హోదా కోసం దీక్ష చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై వైసీపీ వర్గాలు పెదవి విప్పడం లేదు. దీక్షపై నిర్ణయం తీసుకోలేదని అంటున్నాయి. ఇంకోవైపు, ఏప్రిల్ 5 దాకా హోదా కోసం పోరాటలను ఉధృతం చేస్తామని, పార్లమెంటులో పార్టీ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తామని ట్వీట్ చేశారు. హోదా, రైల్వే జోన్, హామీల అమలుపై కేంద్రం నుంచి సానుకూలత రాకపోతే, 6న తమ ఎంపీలతో రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.













