ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదు : సీఎం వైయస్ జగన్
టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలి. చెడిపోయిన వ్యవస్థను బాగుచేసుకోవడానికి తపిస్తున్నా. కళ్లు మూసుకోండని నాపైనా ఒత్తిడి తెచ్చారు. అలా చేయదలుచులేదు కాబట్టే అవినీతిపై పోరాటానికి సిద్ధం అయ్యాను. ఈరోజు ఇలాంటి స్కాంలను సమర్థింలేం. పైస్థాయినుంచి కింది స్థాయి వరకూ ఒక మెసేజ్ పోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదు. రూ.100ల పని రూ.80లకే పని జరుగుతుందంటే రివర్స్ టెండరింగ్‌కు వెళ్దాం. అలాంటి అధికారులను సన్మానిస్తాం. రివర్స్ టెండరింగ్ ఎక్కడ చేయగలమో గుర్తించండి. మన ప్రభుత్వం పారదర్శకత దేశానికి ఒక సంకేతం పంపాలి. అందుకోసమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును కోరాం.
పోలవరంలో అనేక అవకతవకలను ప్రస్తావించిన సీఎం వైయస్ జగన్. అందులో భాగంగా 2 రోజుల క్రితం సాక్షిలో వచ్చిన కథనంలోని అంశాలను ప్రస్తావించిన సీఎం. పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీకి ఆదేశం. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉంది, అవినీతి వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. అవినీతిని సహించబోమని పైనుంచి కింది స్థాయి వరకూ గట్టి సంకేతం పోవాలి.
పోలవరంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్‌టెండరింగ్‌కు ఎక్కడ అవకాశం ఉందో గుర్తించండి. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసింది. స్పిల్‌వే పూర్తిచేయకుండా కాఫర్ డ్యాంకు వెళ్లారు, దాన్ని కూడా పూర్తిచేయకుండా వదిలేశారు. ఫలితంగా గోదావరిలో వెడల్పు తగ్గింది. ఇప్పడు భారీగా వరద వస్తే 4 నెలలపాటు పనులు చేపట్టలేని పరిస్థితి. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి. పోలవరం నాకు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టు.
సీఎం వైయస్ జగన్













