జగన్ ఇక కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనా..
జగన్ విషయంలో కూటమి నేతలు ఎక్కడ తగ్గే సూచన కనిపించడం లేదు. జగన్ ఒక్క మాట మాట్లాడితే నాలుగు మాటలతో సమాధానం చెప్పడానికి కూటమి నేతలు రెడీగా ఉన్నారు. జగన్ విషయంలో జస్ట్ ఎమ్మెల్యే అన్న మాట పదే.. పదే వినిపిస్తోంది.ఇక హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత జగన్ పై సంధించే వ్యంగ్యాస్త్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తెలుగు రాష్ట్రాలలో అనకాపల్లి సెజ్ ఇన్సిడెంట్ తీవ్ర దుమారాన్ని రేపిన విషయం అందరికీ తెలిసిందే. మొన్న చంద్రబాబు బాధితులను పరామర్శించగా నిన్న జగన్ కూడా సెజ్ ఘటనలో బాధితులను పరామర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపి నేతలు జగన్ కు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రిగా ఉన్న అనిత కూడా జగన్ పై తన రేంజ్ లో విరుచుకుపడ్డారు.
మరి ముఖ్యంగా జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అన్నట్లు ఉంది అనిత మాట్లాడే ధోరణి. జగన్ మాటలను లైట్ తీసుకోవాల్సిందే.. ఏమన్నా భూతద్దంలో పెట్టి చూడాల్సిన పనిలేదు అని అనిత వ్యాఖ్యానించారు. అంతేకాదు కళ్ళు ఉండి చూడలేని వారికి.. చెవులు ఉండి వినలేని వారికి మనం ఏమి చెబుతాము అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే అచ్యుతాపురం దుర్ఘటన విషయంలో జగన్ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించారు. బాధితులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని.. సకాలంలో సహాయం అందించలేదని జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు 15 రోజులలోగా నష్టపరిహారం అందకపోతే అనకాపల్లి వచ్చి మరీ ధర్నా చేస్తాను అని ప్రభుత్వాన్ని జగన్ హెచ్చరించారు. దీంతో కూటమి మంత్రులు పెద్ద ఎత్తున జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఆనాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడే.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈనాడు ప్రాణం నష్టం కలిగేది కాదని విమర్శిస్తున్నారు. దుర్ఘటన జరిగిన 24 గంటల లోపే వచ్చిన చంద్రబాబు ప్రజలకు తానున్నాను అన్న భరోసా అందించారని.. తీరికగా ఇప్పుడు వచ్చి నష్టపరిహారం గురించి జగన్ మాట్లాడడం సబబు కాదని విమర్శిస్తున్నారు.













