గవర్నర్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంత మంది కూడా ఉన్నారు. సుంఆరు అరగంట పాటు వీరి భేటీ సాగింది. కరోనా వైరస్ నేపథ్యంలో శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ఆనవాయితీ ప్రకారం •డ్జెట్ సమావేశాల అనంతరం గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమైనట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలపై కూడా గవర్నర్‌తో భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం.













