ఆప్కో, లేపాక్షి ఆన్లైన్ స్టోర్ ప్రారంభం
ఆప్కో- లేపాక్షి ఆన్లైన్ వెబ్స్టోర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోర్టల్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘దేశ చరిత్రలోనే కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.మన జీవితంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వివిధ వ•త్తుల వారికి గౌరవం ఇస్తూ, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చాం. ఆ వర్గాలకే చెందిన వారికి ప్రయోజనం కల్పించే విధంగా ఇవాళ రెండు ఆన్లైన్ స్టోర్లు ప్రారంభిస్తున్నాం. వాటి ద్వారా మన కళలు, చేతి వ•త్తులను బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం అది మాత్రమే కాదు, ఆ కళలు సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
ఆప్కో ఆన్లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా మన రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన కళలు, వ•త్తులకు మరింత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో వాటికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఆన్లైన్లో ఎవరు కొనుగోలు చేసినా, అన్నీ సక్రమంగా అందేలా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇది ఆయా వ•త్తుల కళాకారులకే కాకుండా, వారి ఉత్పత్తులకు కూడా మంచి ఆదరణ లభించేలా చేస్తుందన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, అజియో, పేటీఎం, గో కోప్, మిర్రా, వంటి ఈ-ప్లాట్‌ఫామ్‌లలో కూడా చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఆ మేరకు ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో ఒప్పందాలు చేసుకున్నాయి.ఆప్కో ఆన్లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ చేసి మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, చీరాల తదితర చేనేత, పట్టు, కాటన్ చీరలు, వస్త్రాలు, డ్రెస్ మెటేరియల్స్, బెడ్షీట్లు పొందవచ్చు.ఇక లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కళంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం ఆదివాసీ పెయింటింగ్‌లు, ఉదయగిరిలో చెక్కతో తయారయ్యే కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలుబొమ్మలు పొందవచ్చు.అలా మన కళా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోనూ స్థానం లభిస్తుంది.













