అందుకే రాజకీయాల నుంచి.. వైదొలగాలని నిర్ణయం
ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేనని, అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి వైదొలిగేందుకు అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీలో ముఖ్య సామాజిక వర్గం నన్ను లక్ష్యంగా చేసుకుంది. ఆ సామాజిక వర్గం నన్ను చాలా ఇబ్బందులు పెడుతోంది. జిల్లా పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకోలేదు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసింది? వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా పర్యటిస్తా అని తెలిపారు.













