నారా లోకేశ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి కలిశారు. త్వరలో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని లోకేశ్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బద్వేల్ తెలుగుదేశం మహిళా నేత విజయమ్మకు కైవల్యారెడ్డి కోడలు కావడంతో పుట్టింటితో పాటు మెట్టినింట రాజకీయ పలుకుబడి కూడా ఆమెకు కలిసొచ్చే అవశంగా కనిపిస్తోంది.













