వైసీపీ అరాచక పాలన అంతమొందించడానికి కూటమి ఏర్పడింది.. యార్లగడ్డ వెంకట్రావు
ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత నుంచి ఒక పార్టీపై మరొకరు నిందలు వేయడం కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో కూటమిపై.. పవన్ కళ్యాణ్ పై జగన్ ప్రభుత్వం ఎన్నో రకాల విమర్శలు కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా జగన్ ప్రభుత్వం పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. లేటెస్ట్ గా విజయవాడలో యార్లగడ్డ గ్రాండ్ ఇయర్ కళ్యాణమండపం లో నిర్వహించిన గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన యార్లగడ్డ వైసీపీ పాలనపై విమర్శలు కురిపించారు. జగన్ అరాచక పాలన అంతం అందించడానికి కూటమి ఏర్పాటయిందని.. అందుకే కూటమి సభ్యులందరూ కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ తో కలిసి పనిచేయడానికి విమర్శలను ఎదుర్కొంటూ ముందుకు నడుస్తున్న పవన్ కు యార్లగడ్డ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి జనసైనికుడు పని చేయాలని ఆయన కోరారు. రాబోయే రోజులలో కూటమిదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చంద్రబాబు చేతుల్లోనే ఉంది అని యార్లగడ్డ తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టోని.. సూపర్ సిక్స్ పథకాలను.. ప్రజలలోకి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కార్యకర్తలు విస్తృతంగా తీసుకువెళ్లాలని.. గడపగడపకు శంఖారావం కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు.













