జగన్ సీఎం అయ్యాక ఆ ఐదుగురిపై వేటు
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సీఎంవో నుంచి పలువురు అధికారులను బదిలీ పంపించడంతో పాటు డీజీపీని బదిలీ చేసిన విషయం విదితమే. ఏపీలోని ఐదుగురు ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగులపై వేటు పడింది. కడప జిల్లా శ్రీనివాసపురం రిజర్వాయర్ నిర్మాణంలో కాలువ తవ్వాకాల పనుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను చర్యలు తీసుకోవడం జరిగింది. హంద్రీనీవా పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఈ అధికారులపై ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. రిటైర్డ్ ఐపీఎస్ సత్యనారయణతో విచారణకు సర్కార్ ఆదేశించింది.













