సీఎస్ నీలం సాహ్నితో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో వాటర్ షెడ్ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సచివాలయంలో నీలం సాహ్నితో సమావేశమై వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుపై చర్చించారు. 5 జిల్లాలో చేపట్టేగ వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు 70 శాతం నిధులు (178.50 మిలియన్ డాలర్లు) అందించనుందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 30 శాతం నిధులను సమకూర్చనుందని పేర్కొన్నారు. వాటర్ షెడ్ ప్రాజెక్టు మంజూరైన తర్వాత ఆరేళ్లలో పూర్తి చేయాల్సి ఉందన్నారు.













