మేమంతా సిద్ధం బస్సు యాత్రలో.. సీఎం జగన్ కు నిరసన సెగ
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో తాగునీటి సమస్యల పరిష్కరించాలంటూ గ్రామస్థులు బస్సును అడ్డుకున్నారు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని ఆదేవన వ్యక్తం చేశారు. సరైన నాయకుడు లేక గ్రామంలోని చెరువు నింపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో మహిళలు జగన్ను అడ్డుకునేందుకు సిద్ధమైన విషయం ముందే తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. మహిళల వద్ద నుంచి ఖాళీ బిందెలను స్వాధీనం చేసుకున్నారు. అయినా సరే లెక్క చేయకుండా కొందరు మహిళలు సీఎం వాహనాన్ని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో మహిళానేత శ్రీదేవి బస్సులో నుంచి ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో జగన్ బస్సులో నుంచి కిందకు దిగారు. సెక్యూరిట సిబ్బంది భారీగా మోహరించడంతో కొందరు మహిళలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పి వెళ్లి పోయారు. సీఎం జగన్ కనీసం స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేదని గ్రామస్థులువాపోయారు.













