Minister Savita: నిరూపించలేకపోతే జగన్ రాజీనామా చేయగలరా? : మంత్రి సవిత
వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు తల్లికి వందనం నిధులు దుర్వినియోగమైనట్లు నిరూపిస్తూ రాజీనామా చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత (Minister Savita) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నిరూపించలేకపోతే ఎమ్మెల్యే పదవికి జగన్ (Jagan) రాజీనామా చేయగలరా? అని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ (Mega DSC) పైనే తొలి సంతకం పెడతామని చెప్పామని, చేసి చూపించామని పేర్కొన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో తమకు ఓట్లేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండాపోయిందంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో జగన్ గుర్తించాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి (Education sector) అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.













