Vijayanagaram:ఘనంగా ప్రారంభమైన విజయనగరం ఉత్సవాలు

విజయనగరం ఉత్సవాలు (Vijayanagaram Festivals) ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని పైడితల్లి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై జెండా ఊపి ఉత్సవాలను మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాల ప్రారంభానికి ముందు పైడిల్లి అమ్మవారిని హోం మంత్రి అనిత (Anita) , నేతలు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, డీసీసీబీ చైర్మన్ కమిడి నాగార్జున పాల్గొన్నారు.