చంద్రబాబుపై పోటీచేసే ఉద్దేశమే లేదు… కానీ
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబుపై పోటీ చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ప్రముఖ నటుడు విశాల్ పుల్సాఫ్ట్ పెట్టారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు అక్కడ పోటీ చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. కుప్పంలో చంద్రబాబుకు ప్రత్యర్థిగా విశాల్ పోటీ చేస్తున్నాడు. చంద్రబాబును అసెంబ్లీ లోకి అడుగుపెట్టకుండా చేసేందుకు జగనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇప్పటికే విశాల్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు అంటూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారు. అవన్నీ పుకార్లే. చంద్రబాబుసార్కు ప్రత్యర్థిగా పోటీ చేసే ఉద్దేశమే లేదు. అవన్నీ పుకార్లే. నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. అయితే నా రాజకీయ ప్రవేశం ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను. సమాజసేవ చేసేందుకే రాజకీయాల్లోకి అడుగు పెడతా అని అస్పష్టం చేశారు.













