Visakha : గిన్నిస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 (Yoga Andhra)రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు (Guinness Record) సాధించింది. 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్ (Ramakrishna Beach) , నుంచి భీమిలి (Bhimili) వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. మంత్రులు లోకేశ్(Lokesh), సత్యకుమార్ (Satyakumar ) కు గిన్నిస్ రికార్డు ధ్రువపత్రాలను నిర్వాహకులు అందజేశారు. గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలకు మరో గిన్నిస్ రికార్డు లభించింది. గతంలో సూరత్‌లో నిర్వహించిన యోగా రికార్డును (1.47 లక్షల మంది) ఇది అధిగమించింది.













