జగన్ హై బడ్జెట్ గ్రాఫిక్ షో .. వైరల్ అవుతున్న ఫోటోలు..
రాబోయే ఎన్నికలకు సిద్ధమంటూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు గత కొద్దికాలంగా హడావిడి చేస్తున్నారు. సిద్ధం పేరుతో సభలు కూడా నిర్వహించి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సిద్ధం సభలు ప్రజల కోసం కాదు కేవలం జగన్ జన బలాన్ని చూపించడం కోసం మాత్రమే అనేది ప్రతిపక్షాల నినాదం. మొదటి సభకు మూడు లక్షల మంది వస్తే ,రెండవ సభకి ఆరు లక్షల మంది ,మూడో సభకి పది లక్షల మందిని ఇలా టార్గెట్ గా పెట్టుకున్నారు. సిద్ధం ఆఖరి సభకు మాత్రం 15 లక్షల మంది వస్తున్నట్లు ముందు నుంచే ప్రచారం చేస్తూ వచ్చారు. అంతమంది తో సభ నిర్వహించడం అంటే ఆశామాషి విషయం కాదు. ఇక ఆ విషయాలు పక్కన పెడితే ప్రస్తుతం అద్దంకి సిద్ధం సభకు సంబంధించిన ఫోటోలు ,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తరలివచ్చిన ప్రజల సంఖ్యను చూసి కాదు.. సినిమాలో వాడే గ్రాఫిక్స్ ని అద్భుతంగా ఎక్కువ మంది వచ్చారు అని చూపించడం కోసం వాడడం వల్ల ఆ ఫోటోలు ,వీడియోలు వైరల్ అయ్యాయి. వీడియోలో చూడడానికి ఇసుక వేసిన రాళ్లనంత మంది జనం కనిపిస్తున్నారు.. అయితే కొందరు నెటిజెన్లు పని కట్టుకొని మరి ఆ వీడియోలను బాగా స్టడీ చేసి అవి ఫేక్ అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఒకే రకం జన సమూహం వేరు వేరు చోట్ల ఉండడాన్ని జూమ్ చేసి మరి హడావిడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి.













