Vijay Sethupathi: ఆ హీరోయిన్ ను మాత్రమే ఫాలో అవుతున్న సేతుపతి
ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ సేతుపతి(Vijay sethupathi) ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే హీరోగా, సపోర్టింగ్ రోల్స్ లో, విలన్ గా పలు భిన్న పాత్రలు చేసి సౌత్ లోని టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ సినిమాల్లో కూడా వరుస సినిమాలు చేస్తూ సేతుపతి బిజీగా ఉన్నాడు.
ఉప్పెన(uppena) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సేతుపతి, ప్రస్తుతం టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(puri jagannadh) దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక అసలు విషయానికొస్తే సేతుపతికి ఇన్స్టాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువే. ఆయన్ను ఇన్స్టాలో 8.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. కానీ ఆయన మాత్రం కేవలం ఏడుగురినే ఫాలో అవున్నారు.
ఆ ఏడుగురిలో ఒకే ఒక్క హీరోయిన్ ఉంది. తన కెరీర్లో ఎంతోమందితో కలిసి వర్క్ చేసిన సేతుపతి ఇన్స్టాలో ఒక్క హీరోయిన్ ను మాత్రమే ఫాలో అవడం ఆశ్చర్యంగా ఉంది. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు, తెలుగమ్మాయి అంజలి(anjali). తమిళంలో పలు సినిమాలు చేసిన అంజలి, విజయ్ సేతుపతితో కలిసి రెండు సినిమాలు చేయగా, ఆ రెండూ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. ఆ బాండింగ్ వల్లే సేతుపతి అంజలిని ఫాలో అవుతున్నాడు.













