175 కి 175 కన్ఫామ్ అంటున్న విజయసాయిరెడ్డి..
గత ఎన్నికల్లో వైసీపీకి వెన్నుపూసగా నిలిచిన పీకే ఈసారి జగన్ ప్రభుత్వం ఘోర ఓటమి చవిచూస్తుంది అని జోస్యం చెప్పాడు. అయితే దీని వెనక కేవలం దురుద్దేశమే ఉంది అని విజయ్ సాయి రెడ్డి ఈరోజు పీకే వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. పీకే మాటలను కొట్టి పడేస్తూ.. ఎటువంటి ఆధారం లేకుండా కేవలం దురుద్దేశంతో వైసిపి ఓడిపోతుందని టిడిపి గెలుస్తుందని పీకే ప్రచారం చేస్తున్నాడు అని విజయ్ సాయి రెడ్డి అన్నారు. జగన్ చేసిన మంచి ఇచ్చిన హామీలు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయని.. ఎవరి అబద్దాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కచ్చితంగా ఈసారి 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 ఎంపీ సీట్లు కూడా తమ పార్టీ గెలుస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.













