ఈ మూడు కాళ్ల కుర్చీ కూలిపోక తప్పదు.. టీడీపీ కూటమిపై విజయ్ సాయి రెడ్డి విమర్శలు..
రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడం కోసం టీడీపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. మరింత బలాన్ని చేకూర్చుకోవడం కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ ను కూడా రంగంలోకి దింపడానికి చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వారు ఈరోజు ఢిల్లీలో బీజేపీ నేత అమిత్ షా తో భేటీ అయ్యారు. పొత్తులకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది అన్న టాక్ ఎక్కువగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ ,జనసేన కూటమి తో బీజేపీ చేరితే ఈ మూడు పార్టీలు కలిసి అధికార వైసిపి పై భారంగా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలవడంపై అధికార వైసిపి పార్టీ స్పందించింది. విజయ్ సాయి రెడ్డి ఈ చర్చలపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో ఈ కూటమిని కొత్త సీసాలో పోసిన పాత సారాగా ఆయన అభివర్ణించారు. 2014- 19 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ అబద్దాలను మోసాలను చూశారో అవే తిరిగి రిపీట్ అవుతాయి అని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు కాళ్ల కుర్చీ కూలిపోతుందని.. స్థిరంగా ఉండే ప్రభుత్వాని ఓటర్లు కోరుకుంటారని విజయ్ సాయి రెడ్డి విమర్శించారు.













