Venkaiah Naidu: జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది లేదు : వెంకయ్య నాయుడు
జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది అపోహ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. తిరుపతిలో ఒకే దేశం – ఒకే ఎన్నిక (One country – one election) అంశంపై నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడారు. సాంకేతికత సాయంతో జమిలి ఎన్నికలు (Jamili elections) జరపడం కష్టం కాదని చెప్పారు. కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు. జమిలి ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని, సంయమనం కోల్పోతున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపు లు ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా (Resignation) చేయాలనే నిబంధన రావాలని వెంకయ్య నాయుడు సూచించారు.













