ప్యాకేజీని సీఎం చంద్రబాబు స్వాగతించారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజనను కాంగ్రెస్ సరిగా చేయలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. విభజనపై పార్లమెంట్లో రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. హోదా కంటే మేం ఇచ్చిన ప్యాకేజీ వందరెట్లు నయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటను కూడా మేం భర్తీ చేస్తున్నామని, ప్రజలు తిరస్కరించిన పార్టీలన్నీ ఒక్కటయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో తమకు ఎవరి నుంచి ఎటువంటి సలహాలు అవసరం లేదని అన్నారు. కుటుంబపాలనపై మాట్లాడే అర్హత రాహుల్‌గాంధీకి లేదని అన్నారు. రాజకీయ నేతల వారసులు రాజకీయాల్లోకి రావటంతో తప్పులేదని అన్నారు.













