ఏపీలో ఏ పార్టీతో పొత్తు ఉండదు
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పాటు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మెయిలీ సృష్టం చేశారు. రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం అతిపెద్ద స్కాం అని ఆరోపించారు. అందులో మోదీకి వాటా ఉందన్నారు. రూ.41 వేల కోట్ల ఒప్పందాన్ని రిలయన్స్ కోసం ఒక్కసారిగా రూ.లక్షా 41 వేల కోట్లకు పెంచేశారని ఆరోపించారు. రాఫెల్ ఒప్పందంలో అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 12న జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలు మెమోరాండం సమర్పిస్తారని తెలిపారు.













