వంగూరి ఫౌండేష ఆఫ్ అమెరికా 30వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు
(The Telugu Literary Symposium of India)
మార్చ్ 9-10, 2024
దంటు కళా క్షేత్రం, కాకినాడ (ఆంధ్ర ప్రదేశ్)
సాదర ఆహ్వానం
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 30 వ వార్షికోత్సవ సందర్భంగా జాతీయ స్థాయిలో “అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు” మార్చ్ 9-10, 2024 తేదీలలో కాకినాడ మహా నగరం (ఆంధ్ర ప్రదేశ్) లో జరుగుతోంది. గత మూడు దశాబ్దాలుగా ఐదు ఖండాలలో హైదరాబాద్, హ్యూస్టన్ (అమెరికా), లండన్, సింగపూర్, మెల్బోర్న్ (ఆస్ట్రేలియా), జొహానెస్ బర్గ్ (అంతర్జాలంలో), ఆక్లాండ్ (న్యూజీలాండ్) నగరాలలో 8 ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు, అమెరికా దేశంలో పలు నగరాలలో 13 అమెరికా జాతీయ తెలుగు సాహితీ సదస్సులు, శతాధిక ఇతర సాహిత్య సేవా కార్యక్రమాల నిర్వహణానుభవంతో, భారత దేశ సాహితీవేత్తల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సాహితీ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలే కాక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తెలుగు పండితులు, కవులు రచయితలు, విశ్లేషకులు, సాహితీవేత్తలూ, ఇతర దేశాల ప్రతినిధులూ..అందరూ ఆహ్వానితులే. తమదే అయిన ఈ ప్రత్యేక వేదికలో తెలుగు భాషా, సాహిత్యాభిలాషులు అనేక ప్రాంతాల నుంచి వచ్చే సహ సాహితీవేత్తలని కలుసుకోవడం, తమ అభిప్రాయాలను పంచుకోవడం, తెలుగు భాషా, సాహిత్యాలపై తమ మక్కువ చాటుకోవడం ఈ సాహితీ సదస్సు ముఖ్యోద్దేశం. ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో సాహిత్య పరమైన అంశాలపై ప్రసంగించదల్చుకున్న వక్తల నుండి పత్ర సమర్పణ ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నాం.
పత్ర సమర్పణ ప్రతిపాదనలు పంపవలసిన లంకె
https://docs.google.com/forms/d/e/1FAIpQLSecTL0Kpqz7myCgqYkEAKAve_vz7NQNhkwhMCET0VpwsDUUmQ/viewform
ప్రసంగాంశాలు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక పోకడల దాకా తెలుగు భాష, సాహిత్యాలకు మాత్రమే పరిమితమై ఉండాలి. 35 సంవత్సరాల వయసు లోపు యువతరం వక్తలకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రసంగ సమయం 5-10 నిమిషాలు.
ప్రతిపాదనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: ఫిబ్రవరి 20, 2024.
పూర్తి వివరాలతో సమగ్ర ప్రకటన జనవరి 30, 2024 లోగా వెలువడుతుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో…..
భవదీయులు,
అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం
సంచాలకులు: వంగూరి చిట్టెన్ రాజు: 1 832 594 9054: ఎర్రాప్రగడ రామకృష్ణ: 93979 07344
సమన్వయ కర్తలు: వక్కలంక రామకృష్ణ (94410 11668), Y.S.N. మూర్తి (94409 32342)
ఆహ్వాన సంఘం: గౌరి నాయుడు కొరుప్రోలు (96525 21177), కాళ్ళకూరి శైలజ (98854 01882), మార్ని జానకి రామ చౌదరి (94403 38303)
వేదిక నిర్వహణ: రాధిక మంగిపూడి (90294 09696), సుచిత్రా మూర్తి (81065 76965)
సమగ్ర కార్యాచరణ: అవధానుల మణిబాబు (99481 79437), జోస్యుల కృష్ణబాబు (98664 54340), కె,వి ఎస్. ఆర్. ప్రకాష్ (85003 54650)
కోశాధికారి: శైలజ సుంకరపల్లి (98484 93536)
సలహాదారులు: వంశీ రామరాజు, శాయి రాచకొండ, లక్ష్మీ రాయవరపు













