అహోబిలం ఆలయాన్ని సందర్శించిన అమెరికా భక్తులు
కర్నూలు జిల్లాలోని అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 46 మంది భక్తులు దర్శించుకొన్నారు. వీరు కోల్‌కోతా లోని హరేరామ హరేకృష్ణ వేదపాఠశాలలో గత కొన్నాళ్లుగా అభ్యసిస్తున్నారు. రెండురోజుల పాటు అహోబిలంలో బస చేసి నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొనేందుకు వచ్చినట్లు స్థానిక మఠం మేనేజర్ బద్రినారాయణ తెలిపారు. ఇక్కడి క్షేత్రం, పరిసరాలు అద్భుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా భక్తులు పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో ఈ భక్తుల బృందం హరేరామ హరేకృష్ణ నామంతో చేసిన కీర్తనలు పలువురిని ఆకట్టుకున్నాయి.













