13 జిల్లాలకు రూ.13 కోట్లు
లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు అన్నప్రసాదం అందించేందుకు ఆంధప్రదేశ్‌లోని 13 జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.13 కోట్లు అందించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పద్మావతి వైద్యకళాశాలకు కోవిడ్ 19 వైద్యసేవలు అందించేందుకు ఇప్పటికే రూ.19 కోట్లు మంజూరు చేశామన్నారు. తిరుపతిలో ప్రతిరోజూ 65 వేల మందికి అల్పాహారం, భోజనం అందిస్తున్నట్లు చెప్పారు.













