Nara Lokesh: ఈ ఒప్పందంతో దేశానికి మంచి గుర్తింపు : లోకేశ్

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ (Data Center) ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢల్లీిలో గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. ఢల్లీిలో జరిగిన కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడారు. ఈ ఒప్పందంతో డిజిటల్ హబ్ (Digital Hub)గా దేశానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. టెక్ ప్రపంచంలో ఏపీకి నేడు చరిత్రాత్మక రోజు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇది కొత్త అధ్యాయం. గ్లోబల్ టెక్ మ్యాప్‌పై ఏపీని మరింత బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుంది. విశాఖలో గూగుల్ అడుగుపెట్టడం సంతోషదాయకం. రాష్ట్రంలో పెట్టుబడులకు కొదవే లేదు. విజనరీ నాయకుడు చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి అని అన్నారు.