శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మూెత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. బ్రహ్మూెత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది సెప్టెంబరు 13 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు, అక్టోబర్ 10 నుంచి 18వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో ముఖ్యంగా సెప్టెంబర్ 17న గరుడ వాహనం, 18న స్వర్ణరథం, 20న రథోత్సవం, 21న చక్రస్నానం, ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా నవరాత్రి బ్రహ్మూెత్సవాల్లో ముఖ్యంగా అక్టోబర్ 10న ధ్వజారోహణం, 14న గరుడ వాహనం, 17న స్వర్ణరథం, 18న చక్రస్నానం, ధ్వజారోహణం జరుగుతుందన్నారు. కాగా సెప్టెంబర్ 13న శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పణ జరుగుతుందన్నారు. ఇదిలావుండగా బ్రహ్మూెత్సవాల్లో ప్రతి రోజూ రాత్రి వాహన సేవలను ఈ ఏడాది నుంచి గంట ముందుగా అంటే రాత్రి 8 నుంచి 10 గంటల వరకు, గరుడ సేవను మాత్రం రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.













