సమాజానికి సాహిత్య అవసరం ఎంతో ఉంది!! – మంత్రి పేర్ని నాని
సమాజానికి సాహిత్య అవసరం ఎంతో ఉందని కథ, నవల, వ్యాసం, కవిత, ఇలా అన్ని ప్రక్రియలను చదివి వాటిలోని మానవీయ విలువలను అవగాహన చేసుకున్ననాడు మరిన్ని మంచి రచనలు వెలువడడానికి ఆస్కారం ఉందని ఆ దిశగా ప్రతీ ఒక్కరూ కృషిచేసి మన తెలుగుభాష గొప్పదనాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తిచేయాలని, ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
మచిలీపట్నానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు ఆచార్య పన్యారం సాంబశివరావు మంత్రి పేర్ని నానిని కలిసి ఇటీవల తనకు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన పొయిట్రీ కార్నర్ సాహిత్య సంస్థ నిర్వహించిన ప్రపంచ సాహిత్య పోటీల్లో తన కవిత ‘ సమాజంలో స్త్రీ ‘ ప్రథమ బహుమతి పొందినట్లు 2000 అమెరికా డాలర్లు నగదు బహుమతితో పాటు ఒక జ్ఞాపిక లభించిందని తెలిపారు. ఈ అరుదైన పురస్కారం సాంబశివరావు మాస్టారుకు దక్కడంపై అభినందనలు తెలిపారు.













