తెలుగు భాషా సంఘం చైర్మన్‌గా యార్లగడ్డ
మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను తెలుగు భాషా సంఘం చైర్మన్‌గా నియమించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సృష్టం చేశారు. రాష్ట్ర శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగు భాషలో చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై టీడీపీ సభ్యుడు బుద్దా నాగ జగదీశ్వరరావు ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు సాధ్యం కాదని అన్నారు. తెలుగుకు సంబంధించిన జీవోలన్నీ తెలుగులోనే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల తెలుగు మీడియం పాఠశాలలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.













