వైకాపాలో చేరిన జయసుధ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు సొంతింటికి వచ్చినట్టుగా ఉందని సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ అన్నారు. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో జయసుధ ఆ పార్టీలో చేరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చారని, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పూర్తి కాలం కాంగ్రెస్‌లోనే కొనసాగానని అన్నారు. అప్పుడు ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నానని, ఇప్పుడు జగన్ అదేశాల మేరకు పనిచేస్తానని అన్నారు. ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోలేదని, జగన్ ఆదేశాల మేరకు పనిచేస్తానని ఆమె సృష్టం చేశారు.













