విశాఖ ఎంపీ సీటు టీడీపీ కా లేక వైసీపీ కా…?
విశాఖ ఎంపీ సీటు గెలవడం కోసం పాతికేళ్లగా టిడిపి సుదీర్ఘ పోరాటం చేస్తోంది. చివరిసారిగా 1999లో విశాఖ ఎంపీ సీటు టిడిపి గెలిచింది. టిడిపి పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటికీ పది సార్లు ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి. ఇందులో ఐదు సార్లు ఎంపీ సీట్ హస్తం చేతికి వెళ్ళగా బిజెపి ఒకసారి, వైసీపీ ఒకసారి కైవసం చేసుకున్నాయి. మొదట్లో విశాఖ ఎంపీ సీట్ కాంగ్రెస్ గుప్పెట్లో ఉండేది. అయితే ఆ తర్వాత పవర్ మొత్తం వైసిపి ఖాతాలోకి షిఫ్ట్ అయింది. విశాఖ ఎంపీ స్థానం కోసం టిడిపి నుంచి 2004, 2009లో పోటీ చేసిన ఎంవీవీస్ మూర్తి ఓటమి చవి చూశారు. 2019లో ఆయన వారసుడిగా అదే స్థానం నుంచి బరిలోకి దిగిన శ్రీభరత్ ఓడిపోయాడు. ఇక ఈసారి తిరిగి అదే స్థానం నుంచి తన లక్ పరీక్షించుకోబోతున్నాడు భరత్. దీంతో విశాఖ ఎంపీ సీటు వైసిపి టిడిపి మధ్య టైట్ ఫైట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. పాతికేళ్ల చరిత్రను తిరగరాసి టిడిపి గెలుస్తుందా లేక రెండవసారి గెలిచి వైసిపి తన సత్తా చాటుతుందా వేచి చూడాలి.













