టీడీపీపీ నేతగా జయదేవ్ ఎన్నిక
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లోక్సభలో టీడీపీ పక్ష నేతగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడిని, రాజ్యసభాపక్ష నేతగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు టీడీపీ ఎంపీలు జయదేవ్, రామ్మోహన్, కేశినేని నాని, రాజ్యసభ సభ్యులు సుజనా, సీఎం రమేశ్, గరికపాటి మోహన్రావు, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు.













