వైసీపీలోకి ఎంపీ అవంతి
అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) టీడీపీని వీడి వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనుకున్న ఆయన, మంత్రి గంటా కారణంగా అక్కడ టీడీపీ టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో వైసీపీ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించారు. రాజీనామా లేఖలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు పంపారు. విద్యాసంస్థల అధినేతగా విశాఖ జిల్లాలో ప్రవేశించి, తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అవంతి శ్రీనివాస్ పదేళ్లలో నాలుగు పార్టీలు మారారు. 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరిన ఆయన 2011లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2014లో టీడీపీలో చేరి అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు.













