రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీల బృందం
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేస్తుందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణలో జోక్యం చేసుకోవాలని కోరారు. తాము చెప్పిన విషయాలను రాష్ట్రపతి సావదానంగా విన్నారని, తన పరిధిలో తీసుకోగలిగే చర్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రపతి భవన్ వద్ద ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆంధప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, శాంతిభద్రతలకు సంబంధించిన అన్ని అంశాలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం అని తెలిపారు.
రాజ్యాంగ సంస్థల విధ్వంసం, ప్రాథమిక హక్కులు హరించివేయటం జరుగుతుందన్నారు. శాంతి భద్రతల పేరుతో ప్రత్యర్థులపై కేసులు పెట్టడం. టీడీపీ నేతలను కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టడం. సోషల్ మీడియా పేరుతో ప్రజల గొంతు నొక్కేయడం. మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి అమరావతి చంపేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిపై రాష్ట్రపతి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పటికే కొన్ని విషయాలు రాష్ట్రపతి దృష్టిలో ఉన్నాయి. వీటికి కూడా పరిశీలిస్తామని చెప్పారని కనకమేడల వివరించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో ఎంపీలు గల్లా జయదేశ్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని తదితరులు ఉన్నారు.













