ఆటోలు, ట్రాక్టర్ లపై టాక్స్ రద్దు
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిత్వం మానవత్వం ఆటోలు, ట్రాక్టర్ లపై టాక్స్ రద్దుతో 10 లక్షల కుటుంబాలకు ప్రయోజనం దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని నూతన విధానానికి రాష్ట్ర రవాణా శాఖ లో శ్రీకారం చుట్టింది.. మంత్రి కె.అచ్చెన్నాయుడు.
ఒకే రాష్ట్రం ఒకే నెంబర్ ప్రవేశ పెట్టిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అందుకు అనుగుణంగా చట్టాలను మార్పు చేసి అమల్లోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సరిఅయిన కార్యక్రమాలు చెప్పట్టడం ద్వారా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆదాయాన్ని గణనీయంగా పెంచగలిగం. ఒకే ప్రత్యేక యాప్ ద్వారా రవాణా శాఖ ద్వారా చెల్లింపు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది కుటుంబాలకు ఉపయోగపడేలా ఆటోలు, ట్రాక్టర్ లపై టాక్స్ రద్దు చెయ్యడం జరిగింది.
ఒకప్పుడు చెడ్డ పేరు గల రవాణా శాఖ ను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న శాఖలలో ఉత్తమ శాఖగా రవాణా శాఖ ను రూపుదిద్దడం జరిగింది.. మంత్రి అచ్చెన్నాయుడు.













