సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి ఊరట
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? లేదా? అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబరు 1న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ బోబ్డే ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై యథాతథస్థితి కొనసాగించాలని సూచించింది. తదుపరి విచారణ శీతాకాల సెలవుల తరువాతకు వాయిదా వేసింది.
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.













