ఏపీకి స్కోడా కార్ల కంపెనీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కోడా కార్ల కంపెనీ ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతామని చెక్ రిపబ్లిక్ రాయబారి మిలాన్ హోవర్క్ హామీ ఇచ్చారు. విశాఖ సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు మిలాన్ హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి అమర్నాథరెడ్డితో ఆయన భేటీ అయ్యారు. పారిశ్రామికాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ గురించి మిలాన్‌కు అమర్నాథరెడ్డి వివరించారు. వచ్చే నెల 8న స్కోడా యాజమాన్యం చెన్నై రానున్న దరిమిలా, ఏపీలో స్కోడా కార్ల కంపెనీ ఏర్పాటుపైనా సంప్రదింపులు జరుపుతామని మిలాన్ హామీ ఇచ్చారు.













