Sivaji: అలాంటి పాత్రలు నాకెప్పుడు వస్తాయా అనుకున్నా: శివాజీ
90స్ వెబ్ సిరీస్ తర్వాత హీరో శివాజీ(Sivaji)కి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ అన్నీ తండ్రి పాత్రలే రావడంతో వాటిని ఆయన తిరస్కరించినట్టు చెప్తున్నాడు. కెరీర్లో డిఫరెంట్ పాత్రలు చేయాలనే వాటన్నింటినీ రిజెక్ట్ చేశానని శివాజీ అంటున్నాడు. రీసెంట్ గా కోర్టు(Court) సినిమాలో మంగపతి(Mangapathi) పాత్రలో నటించి నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు శివాజీ.
కోర్టు సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ మంగపతి పాత్ర గురించి, శివాజీ నటన గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మంగపతి తరహా పాత్రల కోసం తాను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నానని, కోర్టు సినిమాతో తనకు కొత్త లైఫ్ మొదలైందని ఆయన తెలిపాడు.
విక్రమ్(Vikram) సినిమాలో ఏజెంట్ టీనా(Agent Tina), సరిపోదా శనివారం(Saripoda Sanivaram)లో సూర్య(SJ Surya) లాంటి పాత్రలు చూసినప్పుడల్లా తనకు ఎప్పుడు అలాంటి పాత్రలు వస్తాయా అనుకున్నానని చెప్పిన శివాజీ, తనకు డబ్బు ముఖ్యం కాదని అదే కావాలనుకుంటే రోజుకు నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూ డబ్బు సంపాదించొచ్చను తనకు సరిపోయే పాత్రలు కోసమే తాను ఇన్నేళ్లు వెయిట్ చేశానని, కోర్టు సినిమాతో తనకు కొత్త జీవితం మొదలైందని శివాజీ అన్నాడు.













