సింగర్ మంగ్లీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవి
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా సింగర్ మంగ్లీ నియమితురాలయింది. మార్చి నెలలో ఆమెను సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఆమె నాలుగు రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. రెండేళ్ల పాటు ఈ పదవిలో మంగ్లీ ఉండనుంది. లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఆమె తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సుంకిడి అనే గ్రామంలో జన్మించారు. కానీ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కర్ణాటక మ్యూజిక్ లో డిప్లొమా పూర్తి చేసిన ఆమె తర్వాత మ్యూజిక్ టీచర్ అవ్వాలనుకుంది. హైదరాబాద్ వచ్చిన మంగ్లీ యాంకర్‌గా మొదలుపెట్టి తర్వాత సింగర్ గా మారింది. సినిమా సాంగ్స్‌లో కూడా ఆమె తనదైన స్టైల్ లో ముందుకు వెళ్ళింది. శైలాజా రెడ్డి అల్లుడు సినిమాలో శైలజ రెడ్డి అల్లుడు చూడు అనే సాంగ్ తో తన సింగింగ్ కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత అనేక సినిమాపాటలు పాడాడు. ఆమె పాడిన రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్న అనే సాంగ్ ఆమెకు బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఈ పదవి రావడానికి కూడా అదే కారణం అని తెలుస్తోంది. ఆ పాట తరువాత ఆమెను వైసీపీ బాగా ఆదరించింది.













