SIFI : ఏపీలో సిఫీ టెక్నాలజీస్ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్చూన్ 500 కంపెనీ సిపీ(SIFI) టెక్నాలజీస్ సుముఖత వ్యక్తం చేసింది. సిఫీ సీఎండీ వేగేశ్న (vegesna) రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh )ను కలిశారు. విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్ (Data Center), కేబుల్ ల్యాండిరగ్ స్టేషన్ ఏర్పాటు పై చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాలు, ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, కొత్తగా తెచ్చిన ఐటీ (IT) పాలసీ గురించి మంత్రి లోకేశ్ వివరించారు. ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డుతో చర్చించి తదుపరి ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఫీ ప్రతినిధులను లోకేశ్ కోరారు.













