షర్మిల ప్రచారం ఆమెకే రివర్స్ అవుతుందా?
కడపలో ఈసారి ఎన్నికల పోరు భీకరంగా సాగేటుగా కనిపిస్తోంది. ఎన్నికలకి ముందు ఆంధ్ర రాజకీయాల్లో షర్మిల సడన్ ఎంట్రీ ఓ సంచలనం అనే చెప్పాలి. తెలంగాణలో పార్టీ పెట్టుకుని అక్కడ రాజకీయం చేసుకుంటూ వస్తున్న షర్మిల సడన్గా ఏపీకి షిఫ్ట్ అవ్వడం అది కూడా కడప నుంచి ఎంపీగా పోటీకి దిగడం హాట్ టాపిక్ గా మారాయి. వివేక కూతురు సునీతని పక్కన పెట్టుకొని షర్మిల తన ప్రచారం కొనసాగిస్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డను.. న్యాయానికి నిలబడ్డాను.. హంతకులకు ఓటేయకండి.. అంటూ ఆమె చేస్తున్న ప్రచారం రివర్స్ లో ఆమెకే కొడుతుంది అన్న టాక్ కడపలో బాగా వినిపిస్తుంది. షర్మిల ,అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుతుందే తప్ప అవినాష్ రెడ్డి ఈరోజు వరకు షర్మిల గురించి గీత దాటి వ్యాఖ్యానించింది లేదు. పైగా అతనే నిందితుదు అన్న విషయం ఇంతవరకు ప్రూ కాలేదు. పైగా గత నెలలో జరిగిన వైయస్ వివేకా వర్ధంతి కార్యక్రమం లో ఎక్కువగా టీడీపీ నేతలు కనిపించారు. దీంతో ఒకరకంగా వైఎస్ కుటుంబం మద్దతుదారుల షర్మిలకు ఎంతవరకు ఓటు వేస్తారు అనేది డౌట్. షర్మిల ఇప్పటికైనా తన ప్రచార పందా మార్చకపోతే ఇరకాటంలో పడడం కన్ఫామ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.













