బాధ్యతలు చేపట్టిన దేవులపల్లి అమర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారునిగా నియమితులైన దేవులపల్లి అమర్ మంగళవారం?బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనరేట్లోబాధ్యతలు స్వీకరించిన తరువాత మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కషి చేస్తాను. సంక్షేమ కార్యక్రమాల్లో పాత్రికేయులకు న్యాయంగా రావల్సినవాటిని రప్పించేందుకు ముందుంటానని అమర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు సజ్జల రామక ష్ణారెడ్డి, కమిషనర్ విజయ్ కుమార్, సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.













